Monday, December 23, 2024

ట్రక్కుకు కారు ఢీకొని ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

హోషియార్‌పూర్ (పంజాబ్ ):పంజాబ్ లోని జలంధర్ పఠాన్‌కోట్ రోడ్డులో శుక్రవారం రాత్రి ట్రక్కుకు కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు జలంధర్ నుంచి ముకేరియన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని డసూయ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సబ్ ఇన్‌స్పెక్టర్ హర్‌ప్రేమ్ సింగ్ చెప్పారు. ఉంచిబస్సి గ్రామానికి కారు సమీపిస్తుండగా గుర్తు తెలియని వాహనాన్ని మొదట ఢీకొని, తరువాత రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. అదే సమయంలో వ్యతిరేక దిశలో రోడ్డుకు అవతలి వైపు ట్రక్కు వస్తుండడంతో దాన్ని కారు ఢీకొంది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారుకు మంటలు అంటుకున్నాయి. కారులోని నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరోవ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడు. హర్యానాకు చెందిన ట్రక్కు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News