Saturday, April 5, 2025

బోల్తాపడిన కారు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్మీపూర్ ఖేరీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. షాజాహన్‌పూర్ నుంచి పాలియాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను లక్మీపూర్ ఖేరీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News