Monday, January 20, 2025

నేపాల్ రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయుల మృతి

- Advertisement -
- Advertisement -

5 killed including 4 Indians in road accident in Nepal

కాట్మండు: నేపాల్‌లోని ధడింగ్ జిల్లాలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు భారతీయులతోసహా ఐదుగురు మరణించారు. థాక్రే ప్రాంతంలోని పృథ్వి హైవేలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కాట్మండుకు 200 కిలోమీటర్ల దూరంలోని అందాల నగరం పోఖరను సందర్శించి నలుగురు భారతీయులు తిరిగి ఇక్కడకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులను ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన బిమల్‌చంద్ అగర్వాల్(40), సాధన అగర్వాల్(35), సంధ్య అగర్వాల్(40), రాకేష్ అగర్వాల్(55)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న నేపాలీ డ్రైవర్ దిల్ బహదూర్ బస్నెత్ కూడా మరణించాడు.

5 killed including 4 Indians in road accident in Nepal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News