Friday, November 22, 2024

5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా నిర్మాణ దశలోనే ఉన్న భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఈ ఏడాది చివరికల్లా సుమారు ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రణాళికా బద్దం గా పనిచేయాల్సి ఉందని నీటి పారుదల శాఖ సంకల్పించింది. అంతేగాక త్వరితగతిన కొత్త ఆయకట్టును సృష్టించబోయే ప్రాజెక్టులకే అదనపు నిధులను కూడా కేటాయించి వాయువేగంగా ఆ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయా ల్సి ఉందని శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థా యి సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడానికి పెద్దపీట వేయాలని, నాణ్యత విషయం లో ఎక్కడా రాజీపడవద్దని మంత్రి ఉత్తమ్ ఇంజినీరింగ్ అధికారులను ప్రత్యేకంగా ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరు నెలల నుంచి ఏడాది కాల వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చేయగలిగిన ప్రాజెక్టులను గుర్తించామని, ఆ ప్రాజెక్టుల నుంచి 4.5 లక్షల ఎకరాల నుంచి గరిష్టంగా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగునీటిని సరఫరా చేయవచ్చునని స్పష్టమయ్యిందని, అందుకే ఆ ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా పరిగణిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం అనంతరం మీడియాకు తెలియజేశారు. స్వల్పకాల వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చేయగలిగిన ప్రాజెక్టులకు నిధులను కూడా పెం చుతామని, ఆ విధంగా నిర్దేశించుకొన్న లక్ష్యాలను సాధిస్తామన్నారు. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టులే నేటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాధనాన్ని సరైన రీతిలో ఖర్చు చేసి ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. అంతేగాక గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎ త్తున నిధుల వృథా, అనుత్పాదక వ్యయం జరిగిందని సమీక్షా సమావేశంలో బహిర్గతమైందని మం త్రి మీడియా ప్రతినిధులకు వివరించారు.

దానికి పర్యావసానంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టును పెంచడంపైనే దృష్టి సారించిందని వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ (2024) డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల నుంచి 5 లక్షల ఎకరాల వర కూ కొత్త ఆయకట్టును సృష్టించడం తమ లక్షమని ఆయన నొక్కిచెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి కొరత సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఈ సమస్యను అధిగమించడానికి క ర్ణాటక రాష్ట్రం నుంచి 10 టిఎంసీల నీటిని తీసుకోవాలనుకొంటున్నామని,అందుకు తగినట్లుగా ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందంగా బెంగుళూరుకు వెళ్ళి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని, 10 టిఎంసీల నీటిని తెలంగాణకు విడుదల చేయాలని కోరుతామని చెప్పా రు. వేసవిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నీటి చెరువులను పూడికతీసి, జంగిల్ క్లియర్ చేసే పనులు చేపడతామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

మేడిగడ్డ బ్యారేజి కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోందని, విజిలెన్స్ నివేదికల ను ఆధారంగా చేసుకొని బాధ్యులపై తగిన చర్య లు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. అంతేగాక కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరు తూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక లేఖను కూడా రాశారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం నిబద్దతతో ఉందని అన్నా రు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కోరు తూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వం లో ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి కేంద్ర జల్‌శక్తి శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశామని, ఆ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ జాతీయ ప్రాజెక్టు హోదాను కల్పించడానికి తమవద్ద నిర్ధిష్టమైన పథకం ఏదీ లేదని స్పష్టంచేశారని, అయినప్పటికీ అందుకు సరిసమానమైన నిధులను మంజూ రు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ వివరించారు.

ఆ హామీ మేరకు ఈ వారంలోనే భారత ప్రభుత్వానికి పాలమూరు-రంగారెడ్డి లిఫ్టు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపుతామని మంత్రి ఉత్తమ్ వివరించారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ల మార్పు పేరుతో గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అసలు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కాళేశ్వరం ఖర్చు లో కేవలం నాలుగో వంతు నిధులతోనే ఏకంగా 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. అనవసరంగా కాళేశ్వరాన్ని చేపట్టి అనేక సమస్యలకు గత పాలకులు కారకులయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే తెలంగాణ ప్రజలు తరతరాలుగా దుష్ఫరిణామాలను చవిచూడాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News