Friday, December 20, 2024

5 లక్షల డ్వాక్రా గ్రూపులను ప్రభుత్వం విస్మరించింది

- Advertisement -
- Advertisement -

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆరోపణ

హైదరాబాద్ : ప్రభుత్వం యాభై లక్షల మంది మహిళలను మోసం చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. సోమవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ 5 లక్షల డ్వాక్రా గ్రూప్‌లను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మహిళలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. ముఖ్యంగా గిరిజన ఏరియాల్లోని మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయన్నారు. అభయహస్తం, బంగారు తల్లి పథకాలు ఎక్కడికి వెళ్లాయని ఆమె ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. పాల్వంచలో కెటిపిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చిందన్నారు. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News