- Advertisement -
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ఓ హిందు కుటుంబం దారుణం హత్యకు గురైంది. ఈ ఘటన గత శుక్రవారం పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి కాలనీలో జరిగింది. కాలనీలో హిందు కుటుంబం నివసిస్తున్న ఇంటిపై గుర్తుతెలియని దుండగలు కత్తులు, గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురిని దుండగలు గొంతులు కోసి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్యకు ఉపయోగించిన కత్తులు, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -