Friday, December 20, 2024

ఐదుగురు ఎంపీలకు “సంసద్ రత్న” అవార్డులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులుగా అత్యుత్తమ పనితీరు కనబరిచి, ప్రజాసమస్యల పరిష్కారంలో చొరవకు గుర్తింపుగా ఇచ్చే “సంసద్ రత్న” పురస్కార విజేతలుగా ఐదుగురు, “సంసద్ మహారత్న” విజేతలుగా నలుగురు లోక్‌సభ సభ్యులు ఎంపికయ్యారు. సంసద్ రత్న అవార్డులకు ఎంపికైన వారిలో బీజేపీకి చెందిన ఎంపీలు సుకాంత మజుందార్, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే ఉన్నారని నిర్వాహకులు వెల్లడించారు. మిగతా ముగ్గురిలో బీజేపీకి చెందిన సుధీర్ గుప్తా, ఎన్‌సిపి ఎంపి అమోల్ రామ్‌సింగ్ కోథే, కాంగ్రెస్‌కు చెందిన కుల్‌దీప్ రాజ్‌శర్మ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.

ఫిబ్రవరి 17న వీరికి ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచన మేరకు చెన్నైకు చెందిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. మొదటిసారి అవార్డుల కార్యక్రమం చెన్నైలో 2010లో అబ్దుల్ కలామ్ ప్రారంభించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తిల సారథ్యం లోని జ్యురీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్టు ఈ సంస్థ సంస్థాపకులు, ఛైర్మన్ కె. శ్రీనివాసన్ వివరించారు

మరోనలుగురికి సంసద్ మహారత్న అవార్డులు
మొత్తం 17 వ లోక్‌సభ కు సంబంధించి ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ ( ఆర్‌ఎస్‌పి కేరళ), అధిర్ రంజన్ చౌదరీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్ ),బిద్యుత్ బరన్ మహాతో ( బీజేపీ ఝార్ఖండ్ ),హీనా విజయ్‌కుమార్ గవిట్ ( బీజేపీ మహారాష్ట్ర ) సంసద్ మహారత్న అవార్డులకు ఎంపికయ్యారని అవార్డ్‌కమిటీ ఛైర్‌పర్సన్, ఫౌండేషన్ ట్రస్టీ సెక్రటరీ ప్రియదర్శిని రాహుల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News