దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు
మరణశిక్ష ఖరారు ఎన్‌ఐఎ కోర్టు తీర్పును సమర్థించిన ఉన్నత
న్యాయస్థానం నిందితులు అసదుల్లా అక్తర్, జియా ఉర్
రహమాన్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, ఐజాజ్ షేక్‌ల
అప్పీళ్లను తిరస్కరించిన న్యాయస్థానం పరారీలో పేలుళ్ల
సూత్రధారి, ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ హైకోర్టు
తీర్పుతో బాధితుల సంబరాలు 2013లో జరిగిన జంట పేలుళ్లలో
18మంది మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన’
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరి శిక్షే సరైందని హైకోర్టు తేల్చి చె ప్పింది. ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఎన్‌ఐఎ కోర్టు తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అసదుల్లా అక్తర్, జియా ఉర్ రహమాన్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, ఐజాజ్ షేక్‌లకు ఉరిశిక్ష విధించిం ది.ఈ పేలుళ్లలో 18మంది మృతి, 131 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. 2016 డిసెంబర్ 13న ఎన్‌ఐఎ ఫాస్ట్ ట్రాక్ కోర్టు యాసిన్ భత్కల్ స హా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై నిం దితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. 2013 ఫిబ్రవరి 21వ తేదీన మొదటి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వచ్చే దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 నంబరు గల బస్‌స్టాప్ వద్ద జరిగింది. మరికొద్ది క్షణాల వ్యవధిలో కోణార్క్ థియేటర్ సమీపంలోని ఎ-1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభ వించింది.
ఆ పేలుళ్లలో గాయపడి అక్కడికక్కడే చనిపోయిన వారు కొందరు, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారు. కొందరు ఇప్పటికీ మంచానికి పరిమితమై సహాయం కోసం ఎదురు చూస్తున్నా రు. ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే, మంచాన పడితే ఆ కుటుంబం బా ధ వర్ణనాతీతం. దోషులకు మరణశిక్ష విధించాలని బాధితుల కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశా రు. వాస్తవానికి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సాయిబాబా టెంపుల్ వద్ద బాంబు పెట్టాలనుకున్నారు. కానీ వీలుకాకపోవడంతో రద్దీగా ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద ఒకటి, బస్ షెల్టర్‌లో మరో బాంబు ను అమర్చి పేల్చడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాగా, ఈ పేలుళ్ల దాటికి మొత్తం 18 మంది మృత్యువాతపడగా, 131 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళ, ఆమె గర్భంలో ఉన్న శిశువుకు కూడా గాయాలయ్యా యి. ఈ పేలుడుపై సరూర్‌నగర్ పో లీసులు కేసు నమోదు చేసి, అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ పే లుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించగా, కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యా ప్తు సంస్థ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో నమోదైన ఈ రెండు కేసులు ఎన్‌ఐఎకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలు ళ్లకు పాల్పడినట్లు గుర్తించింది.
దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ భత్కల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్ది లను 2013లోనే ఇండో-నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు బిహార్‌కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్‌కు చెందిన జియాఉర్ రెహమాన్‌లను 2014 మేలో రాజస్థాన్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజిజ్ షేక్‌ను సైతం ఎన్‌ఐఎ అరెస్ట్ చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియా రియాజ్ భత్కల్‌గా గుర్తించారు. కర్ణాటక భత్కల్‌కు చెందిన రియాజ్ భత్కల్ ఇప్పటికీ పాకిస్థాన్‌లో తలదా చుకున్నట్లు ఎన్‌ఐఎ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్‌ఐఎ ఆరుగురు నిందితులపై ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో 3 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్న ట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచాణలో భాగంగా 157 మంది సాక్షులను ఎన్‌ఐఎ ప్రశ్నించింది. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్‌ఐఎ కోర్టుకు సమర్పిం చింది.
2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులైన అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్‌లను దోషులుగా కోర్టు గుర్తించింది. 2016 డిసెంబర్ 13న ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు దోషులకు జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే ఎన్‌ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ అప్పీల్ చేసుకున్నారు. దీన్ని విచారణకు హైకోర్టు స్వీకరించింది . ఇందులో ఎన్‌ఐఎ అధికారులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ అప్పీళ్లపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి సుధతో కూడిన డివిజన్ బెంచ్ 45 రోజుల పాటు విస్తృతంగా విచారణ చేపట్టింది. మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తన తీర్పును బెంచ్ వినిపించిందీ బెంచ్. 2016లో ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణ శిక్షను సమర్థించింది. నిందితులంతా ప్రస్తుతం వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తు న్నారు. ప్రస్తుతం హైకోర్టు నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
రెక్కీ నిర్వహించారు.. పేలుళ్లకు తెగబడ్డారు…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. ఆ భయానక దృశ్యాలు ఇప్పటికి హైదరాబాద్ వాసులు మర్చిపోలేరు. కేవలం 150 మీటర్ల వ్యాసార్థం లోనే రెండు బాంబులు పేలిపోయాయి. దిల్‌షుక్ నగర్‌లోని కోణార్క్ థియేటర్ వద్ద ఘటన జరిగింది ఇక మరో పేలుడు వెంకటాద్రి థియేటర్ వద్ద బాంబు పేలింది. సైకిల్ పై టిఫిన్ బాక్స్ బాంబులు అమర్చి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అప్పట్లో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఉన్నారు. ఇంప్రూవైజ్డ్ డివైజ్ బాంబులను అమర్చిన ఉగ్రవాదులు ముందుగానే హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కీ వేసి కొన్ని రోజులు పాటుగా అక్కడే ఉండి అదను చూసి బాంబు పేలుళ్లకు తెగబడ్డారు.