Sunday, December 22, 2024

ట్రక్కుకు బస్సు ఢీకొని ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

షాజపూర్ : మధ్యప్రదేశ్ షాజపూర్ జిల్లా మస్కి టౌన్ సమీపంలో గురువారం తెల్లవారు జాము 5 గంటల ప్రాంతంలో ట్రక్కుకు ప్రైవేట్ బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో15 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా నుంచి అలహాబాద్‌కు బాధితులు పెళ్లికి బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

షాజపూర్ జిల్లా దొంత గ్రామం సమీపాన ఈ ప్రమాదం జరిగిందని మస్కి పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి గోపాల్ సింగ్ చౌహాన్ చెప్పారు. నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు ఉజ్జయిన్ ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక మైనరు ఉన్నారు. గాయపడిన వారిని ఉజ్జయిన్ ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News