Monday, July 8, 2024

దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన టోల్ ఛార్జీలు

- Advertisement -
- Advertisement -

దేశంలో మరోసారి టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో శనివారం అర్థరాత్రి నుంచి ఈ ఛార్జీలను పెంచుతూ నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. అన్ని జాతీయ రహదారులపై ఆదివారం నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలను ఎన్‌హెచ్ఏఐ పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే

హైదరాబాద్-విజయవాడ హైవేపై కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.5, రెండు వైపులా కలిపి రూ.10 పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు రూ.10-20, బస్సులు, ట్రక్కులు రూ.25-35, భారీ రవాణా వాహనాలకు రూ.35-50కి పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News