Monday, December 23, 2024

నేడు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో అద్భుతం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేడు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఐదు గ్రహాలు ఒకే కక్షలోకి రాబోతున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే రేఖలో 50 డిగ్రీల పరిధిలో కనిపించబోతున్నాయి. ఇది అరుదైన ఘటన. సూర్యాస్తమయం తర్వాత చూడొచ్చని ఖగోళ పరిశోధకులు అంటున్నారు. ఐదు గ్రహాలు ఒకే రేఖపై వంపు(ఆర్క్) ఆకారంలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదిలావుండగా గురుడు, శుక్రుడు, అంగారకుడిని నేరుగా చూడొచ్చు, కానీ బుధ గ్రహం, యురేనస్ గ్రహాలను మాత్రం బైనాక్యులర్స్‌తో చూడాలని వారు సూచించారు.

సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు చూడండి. భారత దేశంలో సాయంత్రం 6.36 నుంచి 7.15 మధ్య ఈ గ్రహాలు స్పష్టంగా కనిపిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News