Monday, January 20, 2025

ఇటుకల ట్రాక్టర్‌లో ఐదు క్వింటాళ్ల గంజాయి లభ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ట్రాక్టర్‌ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్‌లో ఇటుకల ముసుగులో దాదాపు ఐదు క్వింటాళ్ల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. శ్రీరాంపూర్ జాతీయ రహదారిపై ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను తనిఖీ చేయగా అందులో గంజాయిని గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News