Sunday, February 23, 2025

జార్ఖండ్ బొగ్గు గనిలో మావోయిస్టుల దుశ్చర్య

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో సోమవారం ఉదయం డివిసి బొగ్గు గనులకు చెందిన వెయింగ్ బ్రిడ్జిని తగలబెట్టిన మావోయిస్టులు ఐదుగురు భద్రతా గార్డులను చితకబాదారు.

రాంచికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ట్యూబ్డ్ డివిసి బొగ్గు గనులలో తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ంఘటన స్థలం వద్ద ఒక కరపత్రాన్ని వదిలివెళ్లిన జార్ఖండ్ లాల్ టైగర్(జెఎల్‌టి) అనే మావోయిస్టు గ్రూపు ఈ ఘటనకు తామే బాధ్యులమని తెలిపినట్లు లతేహర్ పోలీసు స్టేషన్ ఇన్ చార్జ్ అశుతోష్ కుమార్ చెప్పారు.

ఐదుగురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను చితకబాదిన మావోయిస్టు గ్రూపు సభ్యులు ట్రక్కుల బరువు తూచే వేయింగ్ యూనిట్‌కు నిప్పుపెట్టారని పోలీసులు తెలిపారు. తమతో చర్చలు జరపకుండా మైనింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని కంపెనీ యాజమాన్యాన్ని జెఎల్‌టి కరపత్రంలో హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News