Friday, December 20, 2024

గొర్రెల మందపై చిరుత దాడి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దేవరకద్ర: గొర్రెల మందలపై చిరుత దాడి చేయడంతో అక్కడికి అక్కడే ఐదు గొర్రెలు మృతి చెందడంతో పాటు 18 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 15 గొర్రెలు కనిపించకపోవడం లేదు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకోవడంతో మండల పరిధిలోని నాగారం గ్రామంలో బెల్లం సాయులుకు చెందిన గొర్రెల మందపై బుధవారం రాత్రి 9 గంటలకు చిరుత దాడి చేసిన్నట్లు సాయిలు తెలిపారు.

దాదాపు 150 గొర్రెలలో 5 మరణించగా, 18 గొర్రెలకు గాయాలు కాగా, 15 గొర్రెల ఆచూకీ తెలియడం లేదని గొర్రెల కాపరి తెలిపారు. మాజీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్‌కు సమాచారం ఇవ్వగా వారు పశువైద్యాధికారి డా. జిసస్ అలీకి, ఫారెస్ట్ అధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ గొర్రెలకు ప్రథమ చికిత్స చేయించారు. దాదాపు రూ 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి సాయిలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News