Wednesday, January 22, 2025

ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఐదు చర్మ సంరక్షణ రహస్యాలు..

- Advertisement -
- Advertisement -

మానవ శరీరంలో అతిపెద్ద అవయం చర్మం. అయితే దీనిని తరచుగా మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. మనలో చాలామంది చర్మం శుభ్రపరుచుకోవడం, మాయిశ్చరైజ్‌ చేయడం చేస్తారు కానీ దాని అవసరాలను తీర్చడం మాత్రం మరిచిపోతుంటారు. మన చర్మంలో మూడు పొరలు ఉంటాయి. బాహ్య పొరను ఎపిడెర్మిస్‌ అంటారు. ఇది ప్రాధమిక రక్షణ అందిస్తుంది. మధ్య పొరను డెర్మస్‌ అంటారు. ఇది ఎపిడెర్మిస్‌కు అవసరమైన మద్దతు,శక్తిని అందిస్తుంది. ఇక చివరి పొరను సబ్‌క్యుటిస్‌ అంటారు. పై రెండు పొరలకు అవసరమైన పోషణను ఇది అందిస్తుంది.

వయసు పెరిగే కొద్దీ చర్మం లక్షణాలు మారిపోతూనే ఉంటాయి. అందువల్ల చర్మ నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియ. సరైన పద్ధతులు అనుసరించడం ద్వారా దీనిని మెరుగ్గా చేయవచ్చు. ఒకరి రోజు వారీ కార్యక్రమాలలో అనుసరించాల్సిన ఐదు చర్మ నిర్వహణ రహస్యాలు ఏమిటంటే…

1. మృదువైన చికిత్స
గాఢత కలిగిన సబ్బులు వాడకూడదు. ఈ తరహా సబ్బులు సాధారణంగా చర్మంకు అవసరమైన నూనెలను కూడా తొలగిస్తాయి. ముఖం లేదంటే మరేదైనా భాగాన్ని తుండుతో రుద్ద కూడదు. చర్మంపై మాయిశ్చర్‌ స్థాయిని నిలిపి ఉంచడానికి స్నానం చేసిన తరువాత లేదంటే ముఖం కడిగిన తరువాత టవల్‌ను చర్మంకు తట్టితే సరిపోతుంది

2. ఆహారం
మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీరు ఆరోగ్యంగా ఉంటారు. మన డైట్‌ను ప్రతిబింబించేది ఈ డైట్‌. తగినంతగా ఆకుకూరలు, లీన్‌ ప్రొటీన్‌, తక్కువ కొవ్వు కలిగి, అధికంగా శరీరానికి అవసరమైన నూనెలు అందించే ఆహారం తీసుకోవాలి. మరీముఖ్యంగా శరీరానికి తగినంతగా నీరు కావాలి. కనీసం రోజుకు ఆరు గ్లాస్‌ల నీళ్లు తాగాలి. ఒకవేళ మీరు మరిచిపోతారనుకుంటే గుర్తు చేయడానికి యాప్‌లు ఉన్నాయి.

3. ఎక్స్‌ఫోలియేషన్‌
చర్మంపై మృతకణాలను తొలగించే పద్ధతి ఎక్స్‌ఫోలియేషన్‌. దీనిద్వారా నూతన కణాలు త్వరగా పునరుద్ధరించబడతాయి. చర్మం ఆరోగ్యవంతంగా, యవ్వనంగా, ప్రకాశవంతంగా కనబడటానికి ఇది తోడ్పడుతుంది. నెలకు 2–3 సార్లు ఎక్స్‌ఫోలియేషన్‌ చేయాలి.

4. తగినంత నిద్ర
ఎలాంటి అనారోగ్యానికైనా తక్కువ ఖర్చులో పరిష్కారమంటే సరైన నిద్ర. తగినంత నిద్రతో ప్రయోజనాలెన్నో ఉన్నాయి. చర్మంపై ముడతలు, డార్క్‌ సర్కిల్స్‌ త్వరగా రాకుండా చేయడంలో ఇది తోడ్పడుతుంది

5. సన్‌స్ర్కీన్‌ రాసుకోవాలి
చర్మం పాడవడానికి సూర్యకిరణాలు కూడా కారణమవుతాయి. చర్మ క్యాన్సర్‌, ముడతుల, చర్మ సమస్యలకు కూడా ఇవే కారణం. అందువల్ల ఎస్‌పీఎఫ్‌ తో కూడిన మాయిశ్చరైజర్‌ లేదంటే సన్‌స్ర్కీన్‌ను ఎండలో కాలు బయటపెట్టడానికి 15 నిమిషాల ముందుగా రాయడం మంచిది.

–డాక్టర్ అలేఖ్య సింగపూర్, డెర్మటాలజిస్ట్- అపోలో స్పెక్ట్రా, కొండాపూర్, హైదరాబాద్

5 Skin Protest Tips for Healthy Skin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News