Wednesday, January 22, 2025

ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్ముకశ్మీర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లా సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఉగ్రవాదుల గురించి కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. సోదాలు జరుపుతుండగానే ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్ గా మారింది.

నియంత్రణ రేఖ సమీపంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది సైన్యం. కృష్ణా ఘాటి సెక్టార్‌లో సెర్చ్ ఆపరేషన్‌లో ఈ రికవరీ జరిగిందని, ఇందులో పాకిస్తాన్‌లో తయారైన స్టీల్ కోర్ కాట్రిడ్జ్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో రెండు బ్యాగుల్లో ఒక ఏకే-47 రైఫిల్, తొమ్మిది మ్యాగజైన్లు, రెండు 438 కాట్రిడ్జ్‌లు లభించాయని వెల్లడించారు. వీటితో పాటుగా ఒక పిస్తోల్, కొన్ని మందులు ఉన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News