Monday, December 23, 2024

భోపాల్ నుండి 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భోపాల్ నుండి ప్రారంభం చేయనున్నారు. ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భోపాల్ ( రాణి కమలాపతి) – ఇండోర్, భోపాల్ (రాణి కమలాపతి)- జబల్పూర్ , రాంచీ-పాట్నా, ధార్వాడ్-బెంగళూరు , గోవా (మడ్గావ్) – ముంబై మధ్య ప్రవేశపెడతారు. గోవా, బీహార్ , ఝాఖండ్ రాష్ట్రాలకు తొలిసారిగా వందే భారత్ రైలు అనుసంధానం కానుంది. నేడు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి రాణి కమలాపతి రైల్వే స్టేషన్ కు చేరుకొని ఈ క్రిందతెలిపిన ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంబించుతారు. వీటిలో 1. భోపాల్ ( రాణి కమలాపతి )-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, 2. భోపాల్ ( రాణి కమలాపతి )-జబల్పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 3. రాంచీ-పాట్నావందే భారత్ ఎక్స్‌ప్రెస్, 4.ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ , 5. గోవా( మడ్గావ్ )-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. కాగా భోపాల్ ( రాణి కమలపతి )-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ , మధ్యప్రదేశ్‌లోని రెండు ముఖ్యమైన నగరాల మధ్య సులభమైన వేగవంతమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది . ఈ ప్రాంతంలోని సాంస్కృతిక, పర్యాటక మతపరమైన ప్రదేశాల అనుసంధాని మెరుగుపరుస్తుంది.

భోపాల్ ( రాణి కమలాపతి ) – జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మహాకౌశల్ రీజియన్ (జబల్‌పూర్) నుండి మధ్యప్రదేశ్‌లోని సెంట్రల్ రీజియన్ (భోపాల్)కి కలుపుతు ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలు కూడా మెరుగైన అనుసంధానం ద్వారా ప్రయోజనం పొందుతాయి.

రాంచీ-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు మొట్ట మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పాట్నా , రాంచీల మధ్య అనుసంధానం పెంపొందించడం ద్వారా ఈ రైలు పర్యాటకులు, విద్యార్థులకు వ్యాపారవేత్తలకు వరంగా మారనుంది. ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కర్ణాటకలోని ముఖ్యమైన నగరాలను – ధార్వాడ్ మరియు హుబ్బల్లి రాష్ట్ర రాజధాని బెంగళూరుతో కలుపుతుంది. ఈ ప్రాంతంలోని పర్యాటకులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారికి ఇది చాలా మేలు చేస్తుంది. గోవా ( మడ్గావ్ )-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గోవా యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ . ఇది ముంబైలోని శివాజీ మహరాజ్ టెర్మినస్ ఛత్రపతి మరియు గోవా మడ్గావ్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. గోవా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యాటకాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News