Friday, January 24, 2025

మీ జుట్టు రాలిపోతుందా? అయితే వీటితో చెక్ పెట్టండిలా..

- Advertisement -
- Advertisement -

ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం సర్వ సాదరణమైపోయింది. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ల లోపం. జుట్టును బలోపేతం, జుట్టు రాలడం తగ్గించడానికి, విటమిన్లు ఎంతో సహాయపడతాయి. ఒకవేళ మీకు తరచుగా జుట్టు రాలిపోతుంటే దానికి విటమిన్ల సమస్య ఉండవచ్చు. ఇప్పుడు జుట్టు రాలడాని తగ్గించడంలో సహాయపడే ఐదు విటమిన్ల గురించి తెలుసుకుందాం.

విటమిన్ – డి

జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో విటమిన్ – డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఉదయం, సాయంత్రం పుట వచ్చే ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ – డి వస్తుంది. అంతేకాకుండా చేపలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి ఆహారాల్లో కూడా విటమిన్ డి ఉంటుంది.

విటమిన్ బి7

ఇది జుట్టును ఎంతో బలపరుస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. గుడ్లు, గింజలు, పప్పులు వంటి ఆహార పదార్థాల్లో ఇది ఉంటుంది.

విటమిన్ ఇ

విటమిన్ – ఇ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది జుట్టును ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదం, అవకాడో, పొద్దు తిరుగుడు విత్తనాలలో ఇది పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ – సి

జుట్టును బలోపేతం చేయడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తుంది విటమిన్ సి. నారింజ, నిమ్మ, స్ట్రాబెరీలు ఇందులో అధికంగా ఉంటాయి.

ఐరన్

ఐరన్ శరీర భాగాలకు ఆక్సిజన్ చేరవేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో అవసరం. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. బచ్చలి కూర, బీట్ రూట్, రెడ్ మీట్ ఇందులో ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News