Sunday, January 19, 2025

సిమెంట్ లారీ బోల్తా.. ఐదుగురు కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఒడిశా లోని మల్కన్‌గిరి జిల్లాలో శనివారం స్వాభిమాన్ అంచల్ ప్రాంతం లోని హంతలగూడ ఘాట్ వద్ద సిమెంట్ రవాణా లారీ బోల్తాపడి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.ఈ లారీ 12 మంది కార్మికులతో చిత్రకొండ నుంచి జోడంబాకు వెళ్తోంది. ప్రమాదంలో 12 మంది కార్మికులు సిమెంట్ బస్తాల మధ్య చిక్కుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సిమెంట్ బస్తాలను తొలగించారు. గాయపడిన కార్మికులను జోడంబా లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News