Sunday, December 22, 2024

ఐదేళ్ల బాలుడి స్కూలు బ్యాగులో గన్.. మరో బలుడిపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

తన బ్యాగులో పాఠశాలకు తుపాకీ తీసుకెళ్లిన ఒక ఐదేళ్ల బాలుడు మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సుపౌల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూలులో బుధవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నర్సరీ చదువుతున్న బాలుడు తన స్కూలు బ్యాగులో తుపాకీ దాచి స్కూలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. 10 ఏళ్ల మరో బాలుడిపై తుపాకీతో కాల్పులు జరపడంతో బుల్లెట్ చేతిక తగిలి ఆ బాలుడు గాయపడినట్లు వారు చెప్పారు. 3వ తరగతి చదువుతున్న బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు. తాను తన తరగతి గదికి వెళుతుండగా ఆ బాలుడు తన బ్యాగులోనుంచి తుపాకీ తీసి తనపై కాల్పులు జరిపాడని,

తాను అడ్డుకోవడానికి ప్రయత్నించగా తన చేతికి గాయమైందని ఆసుపత్రి బెడ్‌పై పడుకుని బాధిత బాలుడు వీడియోలో తెలిపాడు. తనపై కాల్పులు జరిపిన బాలుడితో తనకు ఎటువంటి విరోధం లేదని బాలుడు తెలిపాడు. స్కూలు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు చాలా పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. కాల్పులు జరిపిన బాలుడు, అతని తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ కుమారుడిపై కాల్పులు జరిగినట్లు తెలుసుకున్న బాధిత బాలుడి తల్లిదండ్రులు స్కూలు వద్దకు చేరుకుని స్కూలు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.కాగాజిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులను తరచు తనిఖీ చేయాల్సిందిగా వాటి యాజమాన్యాలను ఆదేశించినట్లు సీనియర్ పోలీసు దికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News