- Advertisement -
గిద్దలూరు: గోడ కూలి ఐదేళ్ల బాలుడి మృతి చెందిన సంఘటన గిద్దలూరు బాలాజీ నగర్ లో చోటు చేసుకుంది. ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రహరి గోడ కూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయ పడ్డ బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మృతి తో గిద్దలూరులో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -