Thursday, January 23, 2025

లిఫ్ట్ గోతిలో పడి ఐదేళ్ల బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

5-year-old boy dies after falling into lift pit

రాజేంద్రనగర్ : అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు లిఫ్ట్ గోతిలో పడి మరణించిన సంఘటన ఇది. పొట్టకూటి కోసం తల్లిదండ్రులు పని చేస్తున్న భవనంలో యజమానులు నిర్లక్షంతో లిఫ్ట్ గోతి ఆ పసిబాలుని నిండు ప్రాణాలు బలితీసుకుంది. కన్నవారిని కంటతడి పెట్టించిన ఈ హృదవిధారక సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేసన్ పరిధిలో జరిగింది. ఏఏస్‌ఐ అమ్జద్ తెలిపిన వివరాల ప్రకారం… గోల్డెన్ హౌట్స్ కాలనీలోని సెంట్ ఆడమ్స్ స్కూల్ సమీపంలో ఓ బాలుడు లిఫ్ట్ గోతిలో పడిన సమాచారం పోలీసులకు అందింది. దాంతో హుటాహుటిన ఏఏస్‌ఐ అమ్జద్ సంఘటన స్థలికి చేరుకుని తీవ్ర గాయాలకు గురైన సుశాంత్(5)ని చికిత్స నిమ్మిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తశ్రావంతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన బాలుని తండ్రి కిషన్ పగలు ఆటో నడుపుకుంటూ రాత్రిళ్లు వాచ్‌మెన్‌గా ప్రమాదం జరిగిన భవనంలో పని చేస్తున్నాడు. తల్లి ఇంట్లో పని చేసి భర్తకు చేదోడు వాదోడుగా అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా భవనంపై ఆడుకుంటున్న సుశాంత్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ కోసం వదిలిన స్లాబ్‌కు అడ్డు గోడలేకపోవడంతో ఆడుకుంటూ వెళ్లి అందులు పడిపోయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పుట్టిన రోజు నాడే సుశాంత్ మృత్యువాతపడడంతో ఆ తల్లిదండ్రుల పడిన తీవ్ర ఆవేదన స్థానికులను కలచి వేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ ఏఏస్‌ఐ అమ్జద్ విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News