Sunday, January 19, 2025

మధురలో కర్కశ సాధువు.. ఐదేండ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపాడు

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ సన్యాసి ఐదేండ్ల బాలుడిని నేలకేసి అదేపనిగా విసిరికొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. బాలుడు చనిపోయే వరకూ కొడుతూ ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చోటుచేసుకుని, అయ్యో పాపం అన్పించేలా చేసింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది వెల్లడికాలేదు. అయితే బాలుడిని కొట్టి చంపిన వ్యక్తి సాధువు దుస్తులలో ఉన్న 55 ఏండ్ల ఓమ్ ప్రకాశ్‌గా గుర్తించారు. ఈ దారుణకాండకు కారణం తెలియలేదు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం నిందితుడు సప్తోసి యాత్రలో ఉన్నాడు.

ఈ యాత్ర మార్గంలోనే బాలుడి తండ్రి ఓ చిల్లరకొట్టు పెట్టుకుని జీవితం సాగిస్తున్నాడు. ఉన్నట్లుండి ఈ బాలుడిని పట్టుకున్న ఓమ్ ప్రకాశ్ అదేపనిగా నేలకేసి కొట్టడంతో బాలుడి తలపగిలిందని స్థానికులు తెలిపారు. క్షణాల్లోనే ఈ దారుణం జరిగింది. అక్కడున్న వారు ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. దాడిలో ఓమ్ ప్రకాశ్‌కు గాయాలు అయ్యాయి. చికిత్సకు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారి ఈ వ్యక్తి కోలుకున్న తరువాత ఈ సాధువు విచారణ చేపడుతారని, ఎందుకు బాలుడిని చంపాడనేది తేల్చుకుంటామని స్థానిక ఎస్‌పి త్రిగుణ్ బిసెన్ ఆదివారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News