Sunday, December 22, 2024

యంగ్ ఎకోహీరో అవార్డ్ విజేతలుగా ఐదుగురు భారతీయ యువకులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించే చొరవ చూపినందుకు ఐదుగురు భారతీయ యువకులకు 2023 అంతర్జాతీయ యంగ్ ఎకోహీరో అవార్డ్ లభించింది. అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ “యాక్షన్ ఫర్ నేచర్ ” ఈ యువకులను గుర్తించింది. మీరట్‌కు చెందిన ఎయిహ దీక్షిత్, బెంగళూరుకు చెందిన మాన్యహర్ష, న్యూఢిల్లీకి చెందిన నిర్వాణ్ సొమనీ, మన్నత్ కౌర్, ముంబైకి చెందిన కర్ణవ్ రస్తోగి అవార్డు విజేతలుగా వచ్చారు. ఇండిపెండెంట్ జడ్జిలు, పర్యావరణ శాస్త్ర , బయోలజీ, విద్యారంగ నిపుణులతో కూడిన ప్యానెల్ వీరిని విజేతలుగా నిర్ణయించింది. అత్యంత క్లిష్టమైన వాతావరణ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సంస్థ 8 నుంచి 16 ఏళ్ల పిల్లలను, యువకులను గత ఇరవై ఏళ్లుగా ప్రోత్సహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News