Sunday, April 20, 2025

50 రోజులు గడిచినా దొరకని పైలట్ వాసవి అచూకి..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ లో వాసవి అనే లోకో పైలట్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. 50 రోజుల క్రితం అదృశ్యమైనా.. ఇప్పటివరకు జాడ లేదు. ఆమె ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవికి పెళ్ళి సంచిత్ సాయితో కుదిరింది. ఈ మేరకు పోలీసులు విచారణలో భాగంగా చిత్ సాయిని విచారించగా వాసవికి తనకు ఆర్యవైశ్య మ్యాట్రీమొనీ ద్వారా పెళ్లి కుదిరిందని, డిసెంబర్ 11న పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, ఇద్దరం కలిసి పెళ్లి షాపింగ్ చేశామని తెలిపారు. వాసవితో నవంబర్ 30న చివరిసారిగా మాట్లాడానని సంచిత్ సాయి తెలిపారు. వాసవి అదృశ్యానికి కారణాలు తనకు తెలియని, వాసవికి తన నుంచి ఎలాంటి వేధింపులు, గొడవలు లేవని సంచిత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News