- Advertisement -
అబుజా: నైజీరియా దేశం ఒండో రాష్ట్రంలో సెయింట్ ప్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఉగ్రవాదులు బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఈ మారణకాండలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక శాసన సభ్యుడు టిమిలెయిన్ తెలిపారు. ఈ దాడిలో వందల సంఖ్యలో గాయపడి ఉంటారని స్థానిక మీడియా వెల్లడించింది. ఆదివారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా చర్చిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ప్రధాన పాస్టర్‌ను కిడ్నాప్ చేశారు. చర్చి ప్రాంగణం రక్తపు మడుగులా ఉంది. ఎటు చూసిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మాడు బుహరి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
- Advertisement -