హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీనీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని తన నివాసంలో కలిసి కోరడం జరిగినది. అదేవిధంగా విద్యాహక్కు చట్టం ప్రకారం కళాశాలల్లో 25 శాతం ఉచిత విద్య అందించే పథకాన్ని పకడ్బందీగా అమలు పరుస్తూ ఈ పథకంలో జర్నలిస్టుల పిల్లలకి అవకాశం కల్పించాలని కోరారు .ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించేందుకు ప్రభత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అద్యక్షులు పురుషోత్తం నారగొని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఏర్రమాద హరి నారాయణ, కోశాధికారి పాపని నాగరాజు, ముత్యం ముఖేష్ గౌడ్, బుడంపల్లి నిరంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -