Wednesday, January 22, 2025

వికారాబాద్‌లో రైలు ఢీకొని 50 మేకలు మృతి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: రైళ్లు ఢీకొని 50 మేకలు మృతి చెందిన ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డికె తండాలో గొర్రెల కాపరులు తన మేకలను మేపడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. మేకలను మేపుతుండగా అడవి పందుల గుంపు రావడంతో అవి బెదిరి రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాయి. అదే సమయంలో రెండు రైళ్లు రావడంతో మేకలను రైలు ఢీకొట్టడంతో కొన్ని మేకలు ఎగిరి 50 మీటర్ల దూరంలో పడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మేకలు మృతి చెందాయని గొర్రెల కాపరి తెలిపాడు. మేకలు చనిపోవడంతో తాను జీవనోపాధి కోల్పోయానని గొర్రెల కాపరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వమే తనని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News