Sunday, January 19, 2025

20 మంది ఎంపిలు 50 గంటల దీక్ష

- Advertisement -
- Advertisement -

 

పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద

న్యూఢిల్లీ : రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన 20 మంది విపక్ష ఎంపిలు బుధవారం పార్లమెంట్ ఆవరణలో 50 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తే సభా ఆటంకాల తీర్మానం పెట్టి బహిష్కరించారని,ఈ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నామని పేర్కొన్న ఎంపీలు దీక్షకు దిగారు. ఆవరణలోని గాంధీజీ విగ్రహం వద్ద లాన్స్‌లో భైఠాయించిన ఎంపిలు తమ నిరసన శుక్రవారం మధ్యాహ్నం వరకూ సాగుతుందని తెలిపారు. సస్పెండయిన టిఎంసి, టిఆర్‌ఎస్, డిఎంకె, సిపిఎం, సిపిఐ, ఆప్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు లోక్‌సభ సభ్యులను అంతకు ముందు రోజు సస్పెండ్ చేశారు. రెండు రాత్రులు, రెండు పగళ్లు తమ దీక్ష సాగుతుందని, ఇక్కడనే ఉండి తమ నిరసన సాగిస్తామని టిఎంసి ఎంపి డోలా సేన్ తెలిపారు.

ఎంపిలు క్షమాపణ చెపితే సస్పెన్షన్ల ఎత్తివేత
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ

పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్లపై సంబంధిత వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం స్పందించారు. సభ్యులు క్షమాపణలు చెప్పి, ఇక ముందు సభలో ప్లకార్డులకు దిగబోమని హామీ ఇస్తే వారి సస్పెన్షన్లను వెనకకు తీసుకునే వీలుందని తెలిపారు. సభ్యులు కట్టుబాట్లు తప్పితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ధరలు, జిఎస్‌టి ఇతర అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కోవిడ్ నుంచి కోలుకుని ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లుతున్నారని , తక్షణం కూడా ప్రభుత్వం చర్చకు సిద్ధమని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News