Monday, December 23, 2024

బ్లాంక్ కాల్స్‌తో రూ.50 లక్షలు హాంఫట్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: మీ పర్సనల్ ఐడెంటిఫికేషన్‌ను, ఓటిపిలు, పిన్‌లు ఎవరికీ చెప్పవద్దని సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు రావడం మనలో చాలామంది గమనించే ఉంటాం. అయితే అవలి వైపున ఎవరూ మాట్లాడకుండా బ్లాంక్ కాల్స్ వస్తే ఏం చేయాలి..ఇది కూడా మనం జాగ్రత్త పడాల్సిన విషయమేనా? ఢిల్లీకి చెందిన ఒక సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్ ఒకరు కేవలం తన సెల్‌ఫోన్‌కు వచ్చిన బ్లాంక్ కాల్స్ ద్వారా రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. డబ్బు రూపంగా చూస్తే దేశంలో జరిగిన అతి పెద్ద సైబర్ క్రైమ్ చోరీగా ఈ సంఘటనను పోలీసులు పరిగణిస్తున్నారు. భాస్కర్ మండల్ అనే వ్యక్తి ఖాతాకు రూ. 12 లక్షలు, మరో రెండు ఖాతాలకు రూ. 10 లక్షల చొప్పున, విజిత్ గిరి అనే వ్యక్తి ఖాతాకు రూ. 4.6 లక్షల చొప్పున ఆ డైరెక్టర్ ఖాతా నుంచి బదిలీ అయ్యాయి.

సిమ్ స్వాప్ టెక్నిక్ ద్వారా సైబర్ నేరస్తులు ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్‌కు టెక్ట్ మెసేజ్ లేదా కాల్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కొట్టేసి ఉంటారని వారు భావిస్తున్నారు. వ్యక్తుల మొబైల్ ఫోన్‌లో వాడే సిమ్ కంపెనీలను బురిడీ కొట్టించడం ద్వారా కొత్త సిమ్ కార్డును యాక్టివేట్ చేయించి ఆ తర్వాత ఫోన్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం కూడా స్కామ్‌స్టర్ల ఎత్తుగడని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తులకు వచ్చే ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేసి ఓటిపిలను వినడం కూడా ఈ స్కామర్లు చేస్తుండవచ్చని వారు అనుమానిస్తున్నారు. తాజా సంఘటన విషయంలో ఫోన్ హైజాక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ స్కామ్‌స్టర్లు జార్ఖండ్‌లోని జాంతారా నుంచి ఆపరేట్ చేస్తుండవచ్చని వారు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News