Friday, December 20, 2024

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుల అరెస్ట్, రూ. 50 లక్షలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గడ్డం వివేక్ సంస్థలకు చెందిన ఉద్యోగులు పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తూ పట్టుబడ్డారు. విశాఖ ఇండస్ట్రీస్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న కంజుల రవి కిషోర్, ఒక పత్రికలో మార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ 50 లక్షల రూపాయలు తరలిస్తుండగా, హైదరాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బును చెన్నూరుకు తరలిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు తెలిసింది. నిందితులనుంచి రూ. 50 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News