Wednesday, January 22, 2025

దీపావళి…. బాణసంచా కాల్చుతూ 50 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చుతుండగా 50 మంది యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులు సరోజీని దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటారు. 45 మంది స్వల్ప గాయాలు కావడంతో చికిత్స చేసి ఇంటికి తరలించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. గాయపడిన వారి వయసు 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య ఉందని వైద్యులు తెలిపారు. బాణసంచా కాల్చుతుండగా కంటికి ఎక్కువగా గాయాలయ్యాయని వెల్లడించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య రోడ్ల మీద బాణాసంచా పేల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా హెచ్చరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News