Thursday, January 23, 2025

కొత్తగా 50 మెడికల్ కాలేజీలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 50 వైద్యకళాశాలలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అనుమతిని ఇచ్చింది. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 1 లక్ష దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా గురువారం గుర్తింపు పొందిన 50 మెడికల్ కాలేజీల జాబితాను వెలువరించింది. దీనితో ఇప్పుడు మొత్తం మీద వైద్య కళాశాలల సంఖ్య 702కు, వైద్య కోర్సుల్లో సీట్ల సంఖ్య 1,07,658కు చేరుతుంది. ఇప్పుడు ప్రకటించిన కాలేజీల్లో తెలంగాణకు చెందిన 13 గుర్తింపు పొందిన వైద్య కళాశాలలు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి ఐదేసి చొప్పున వైద్య కళాశాలలు,

మహారాష్ట్ర కాలేజీలు నాలుగు గుర్తింపు పొంది ఉనికిలోకి వస్తాయి.అసోం, గుజరాత్, కర్నాటక, తమిళనాడు నుంచి మూడేసి కాలేజీలు, హర్యానా, జమ్మూ కశ్మీర్, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌కు రెండేసి , మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్ ఒక్కో కాలేజీని పొందుతాయి. మెడికల్ కాలేజీల్లో పెంపుదలతో ఇప్పడున్న వైద్య సీట్లకు అదనంగా 8195 సీట్లు వచ్చి కలుస్తాయి. ఇప్పుడు అనుమతి పొందిన 50 కాలేజీల్లో 30 వరకూ ప్రభుత్వ, 20 వరకూ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News