Sunday, December 22, 2024

జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః హైదరాబాద్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆర్.రోహిణి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు డిప్యూటీ ఎడ్యకేషనల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూళ్లకు సర్య్కులర్ జారీ చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి హైదరాబాద్ స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజులో రాయితీ కల్పించాలని కోరుతూ హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే -టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధి బృందం ఇటీవల డీఈఓకు వినతి పత్రం సమర్పించారు. దీంతో డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ సర్క్యూలర్ జారీ చేయట పట్ల హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి.అరుణ్ కుమార్, జగదీష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News