హరియాణలోని నుహ్‌లో జరిగిన ఘర్షణల తర్వాత రేవారీ, మహేందర్‌గఢ్, ఝజ్జర్ మూడు జిల్లాల్లోని 50 పంచాయతీలు వారి గ్రామాల్లోకి ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధిస్తూ లేఖలు జారీ చేపి పోస్టర్లు వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గత కొద్ది రోజులుగా దాదాపు 50కి పైగా పంచాయతీలు వారివారి గ్రామాల్లో ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇలాంటి లేఖలు జారీ చేశాయి. గ్రామాల్లో నివసిస్తున్న ముస్లింలు తమ గుర్తింపు పత్రాలను పోలీసులకు సమర్పించాలని సర్పంచ్‌ల సంతకాలతో కూడిన లేఖల్లో రాసి ఉంది. ఎవరి మత మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదని లేఖలో రాశారు. ఇలాంటి లేఖలు జారీ చేయడం చట్ట విరుద్ధం.
కానీ పంచాయతీల నుంచి మాకు ఎలాంటి లేఖలు రాలేదు. ఈ విషయాన్ని మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను అని కొందరు అంటున్నారు. ఈ గ్రామాల్లో మైనార్టీ జనాభా 2% కూడా లేదు. అందరూ సామరస్యంగా జీవిస్తున్నారని, అలాంటి సూచన సామరస్యానికి విఘాతం కలిగిస్తుందని ఓ ముస్లీం వ్యాపారి అంటున్నారు. దీనిపై సైద్‌పూర్, మహేందర్‌ఘర్ సర్పంచ్ వికాస్ మాట్లాడుతూ, గ్రామంలో గత జూలైలో అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయి. అవాంఛనీయ సంఘటనలన్నీ బయటి వ్యక్తుల తర్వాత మాత్రమే జరగడం ప్రారంభించాయని అన్నారు.