Wednesday, January 22, 2025

కృష్ణలో 50% వాటా ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

బోర్డుకు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్

మన కృష్ణాదీజలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 50శాతం నీటి వాటాలను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణానదీయాజమాన్యబోర్డుకు విజ్ణప్తి చేశారు. సోమవారం నాడు బోర్డు చైర్మన్ ఎంపి సింగ్‌కు లేఖ రాశారు. గత బోర్డు సమావేశంలోనే కృష్ణానదీజలాల పంపిణీపై రాష్ట్రం అభిప్రాయం తెలిపామన్నారు. 202122లో తాత్కాలిక ప్రాతిపదికన నీటివాటాలను 66,34నిష్పత్తిలో పంపిణీకి అంగీకరించామన్నారు. అది ఆ ఏ డాదికి తాత్కాలిక అంగీకారం మాత్రమే అని స్పష్టం చేశారు. బేసిన్ పరిధిలో రాష్ట్రానికి నీటి అవసరాలు పెరుగుతున్నందున దీన్ని దృష్టిలో పెట్టుకుని 50 శాతం నీటి వాటాను కేటాయించాలని స్పష్టం చేశారు. ఈ నెల 6న జరగనున్న బోర్డు సమావేశం అజెండాలో ఈ అం శాన్ని కూడా చేర్చాలని లేఖ ద్వారా బో ర్డు చైర్మన్‌ను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News