Thursday, December 19, 2024

ఎంఎ జర్నలిజం చేయాలనుకునే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీ

- Advertisement -
- Advertisement -
మొదటగా దరఖాస్తు చేసుకున్న 25 మంది జర్నలిస్టులకు వర్తింపు
మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ నిర్వహిస్తున్న ఎంఎ (జర్నలిజం) 2023,-24 విద్యా సంవత్సరం కోర్సులో చేరే వర్కింగ్ జర్నలిస్టులకు మొత్తం ఫీజులో 50 శాతం ఫీజును అకాడమీ భరిస్తుందని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ కోర్సులో చేరే ఆసక్తి గల వర్కింగ్ జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తును ఈనెలాఖరులోగా పంపాలన్నారు. జర్నలిస్టు తాను పంపిన దరఖాస్తు వివరాల కాపీని కార్యదర్శి, మీడియా అకాడమి, ఇంటి.నె.10-2-1, ఎఫ్‌డిసి బిల్డింగ్, 2వ అంతస్తు, సమాచార భవన్, ఎసి గార్డ్ మాసబ్ టాంక్, హైదరాబాద్ 500028కు అందజేయాలన్నారు.

తొలుత దరఖాస్తు చేసుకున్న (25) మంది జర్నలిస్టులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని, రెండు సంవత్సరాల ఈ పిజి కోర్సుకు బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం ఫీజు రూ.7800లు, రెండో సంవత్సర ఫీజు రూ.7500 లుగా యూనివర్శిటీ నిర్ణయించిందన్నారు. వర్కింగ్ జర్నలిస్టు తాను పనిచేసే సంస్థ నుంచి గుర్తింపు ఆధారాలను ఆన్‌లైన్‌లో సమర్పిస్తేనే అకాడమీ అందించే 50 శాతం రాయితీని పొందగలుగుతారన్నారు. దరఖాస్తు చేయాలనుకున్న జర్నలిస్టులు ఇతర వివరాలకు అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.braouonline.in, www.braou.ac.in చూడవచ్చన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News