Thursday, January 23, 2025

ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి వర్తించదు : కేంద్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 50 శాతం రిజర్వేషన్ల కోటా ఆర్టికల్ 15(4), 16 (4) కింద ఇచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 15(6), 16(6) కింద ఇచ్చిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు ఆ పరిమితి వర్తించదని స్పష్టం చేసింది. 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల వల్ల రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటిందన్న సభ్యుల ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.

ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌ శాతాన్ని 27% నుంచి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందా అని రాజ్యసభ ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ పిల్లి అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్‌ సమాధానమిచ్చారు. 103వ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News