Thursday, January 23, 2025

రక్షణ శాఖ భూములిస్తే అభివృద్ధి మరింత హై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పట్టణాల కోసం నిబద్దతతో పనిచేశాం కాబట్టే కేంద్రం కూడా గుర్తిచాల్సిన పరిస్థితి కల్పించామని రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో బుధవారం ఆయన రాష్ట్ర పురపాలక శాఖ 9 ఏళ్ల నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందువల్లే అనేక అవార్డుల, ప్రశంసలను ప్రత్యర్ధి అయినప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ ప్రజలకు భద్రత కల్పించేందుకు స్కై వేలు, ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు రక్షణ శాఖ భూములను అడిగామని, అయితే కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సుమారు 45 నుంచి 50 శాతం ఆదాయం ఒక్క హైదరాబాద్ నుంచి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నగరంలో ప్రజా రవాణాను మెరుగుపర్చడం, మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమత్తు కార్యక్రమాల వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పాతబస్తీ మెట్రో రైల్ కోసం కేంద్రాన్ని నిధులను అడిగామని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేస్తామని మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు. ఐదుగురు కేంద్ర మంత్రులు మారినా నగరంలో ప్రజారవాణాకు రక్షణ భూములు అడిగితే ఒకటిన్నర ఎకరం కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

మెట్రో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్‌లను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని. కంటోన్మేంట్ పైన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అయినప్పటికీ మేము జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నామన్నారు. 111 జీవో రద్దు కోసం అన్ని పార్టీలు హమీలు ఇచ్చాయని, మేము చేప్పినట్టే జీవోను రద్దు చేశామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News