Thursday, January 23, 2025

దళితబంధులో మాలలకు 50 శాతం కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకం లో మాలలకు 50 శాతం యూనిట్లు కేటాయించాలని మాల ప్ర జా సంఘాల జేఏసి చైర్మన్ జి. చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదటి విడత దళిత బంధులో మాల, మాల ఉపకులాలకు కేవలం 1 శాతం కూడా యూనిట్లు అందలే దని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితబంధు పథకంలో 50 శాతం యూనిట్లు మాలలు, మాల ఉపకులా లకు కేటాయించాలని, మాల సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవనాన్ని బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్థలాన్ని కేటా యించి, నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గురువారం ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా మాల ప్రజా సంఘాల జేఏసీ చెన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మాలలు అందరి కంటే ముందు వరుసలో ఉండి కొట్లాడినట్టు తెలిపారు. కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాలలను విస్మరిస్తున్నట్టు విమర్శించారు. మాలలను విస్మరించే శాసన సభ్యులకు వ్యతిరేకంగా మాలలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. ధర్నా లో వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, కరణం కిషన్, మం చాల లింగస్వామి, గద్ద శ్రీనివాస్, డోపోజు రమేష్, మన్నె శ్రీధర్, పేరోజు మహేశ్వర్, కోతి ఇందిరా, మధబాబు, మన్నె రంగ, కొమ్మతోటి పౌల్, జెట్టి వెంకటేష్, జంగా శ్రీనివాస్, రాజేష్, బైండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News