Friday, November 22, 2024

వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

బీసీల డిమాండ్లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఓడిస్తాం: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్:  వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని, దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టడానికి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిసి డిమాండ్ల కోసం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లపై విధాన ప్రకటన చేయాలన్నారు. శనివారం బీసీ ముఖ్య నాయకుల కోర్ కమిటీ సమావేశంగుజ్జ కృష్ణ , కె. సుంధర్ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో బీసీ సంఘం నాయకులు ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను, పార్లమెంట్ సభ్యులను, ప్రతి పక్ష పార్టీ నేతలను కలిసి బీసీలకు రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన వాటాను ఇవ్వవలసిన ఆవశ్యకతను వివరించినట్లు చెప్పారు.

స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుంచే బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హస్తినలో ప్రధానమంత్రి నరేంద్ర మోడిని, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, అమిత్ షా, రామ్ దాస్ అథ్వాలే, హరిదీప్ సింగ్ పూరీ, బి.సి కమిషన్ ఛైర్మన్ లను అన్ని పార్టీలకు చెందిన నాయకులను కలిసి బీసీల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. 94 మంది పార్లమెంటు సభ్యులను, కేంద్రమంత్రులను, ప్రతిపక్ష నేతలు మల్లికార్జున్ కార్గే, సీతారాం ఏ చూరి, కేశవ రావు, రాజా, విజయ సాయి రెడ్డి, సంతోష్ తదితరులను కలిసి చర్చలు జరిపినట్లు చెప్పారు. తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికలలో బి.సిలకు 50 శాతం టికెట్లు అన్నీ పార్టీలలో ఇవ్వాలి. పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలి. పంచాయతీరాజ్ సంస్థ బి.సి. రిజర్వేషన్లను 34 శాతం నుండి 56 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.

బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. త్వరలో జరిగే జనగణనలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమీ లేయర్ ను తొలగించాలి.
కేంద్రంలో బిసి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బిసి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలి.
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బిసి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి యాక్టును తీసుకరావాలి
రాష్ట్రంలో కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బిసి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలి.
ప్రెవేట్ రంగ పరిశ్రమలలో, కంపెనీలలో తదితర ప్రెవేట్ రంగాలలో ఎస్సీ,ఎస్టీ,బిసి లకు జనాభా ప్రకారం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని సూచించారు. అనంతరం బి.సి సంక్షేమ సంఘం జాతీయ సెక్రెటరీగా కల్లేపల్లి సుందర్‌ను నియమించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News