- Advertisement -
న్యూఢిల్లీ: మండల్ కమిషన్ కేసులో 1992లో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం నిర్ణయించిన రిజర్వేషన్ల 50 శాతం పరిమితి ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని, అయితే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా ఆ పరిమితి కిందికి రానిదని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేల ఎం. త్రివేది, జెబి. పార్దివాలాతో కలిసి 103వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 చెల్లుబాటును సమర్థించారు.ఇదిలావుండగా తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల తీర్పు పెండింగ్‌లో ఉన్నందున, సంబంధిత పక్షాల వాదనలను వినకుండానే మెజారిటీ అభిప్రాయం దానికి ముగింపు పలుకవచ్చని జస్టిస్ భట్ హెచ్చరించారు.
- Advertisement -