- Advertisement -
నవా రాయ్‌పూర్: ఇక్కడ శనివారం జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతులు(ఓబిసి),మహిళలు, యువకులు, మైనారిటీలకు కార్యవర్గంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ తన రాజ్యాంగాన్ని సవరించింది.
పార్టీ సవరించిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లూసి)లో పార్టీకి చెందిన మాజీ ప్రధాన మంత్రులు, మాజీ ఏఐసిసి చీఫ్‌లు ఉంటారు. సిడబ్లూసి సభ్యుల సంఖ్య 25 నుంచి 35కు పెరుగుతుంది. ఇకపై పార్టీకి డిజిటల్ సభ్యత్వం, రికార్డులు మాత్రమే ఉంటాయని సవరించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం చెబుతోంది.
- Advertisement -