Sunday, January 19, 2025

కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి… రూ.6 లక్షల ఆస్తి నష్టం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మలేశం అనే వ్యక్తి గొర్రెలు కాపరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తనకున్న 70 గొర్రెలతో గ్రామ శివారులో మేపుకొని తన పొలం వద్ద ఉన్న షేడ్డులో ఉంచాడు. భోజనం చేద్దామని ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి గొర్రెలు చనిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కుక్కల దాడితో తన జీవనోపాధి కోల్పోయానని కన్నీరు మున్నీరయ్యాడు. ఆరు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందిని పభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News