- Advertisement -
భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఓ హోటల్ ధ్వంసం అయింది. 50 మంది దుండగులు హోటల్ ను ధ్వంసం చేశారు. హోటల్, స్థలం యజమానుల మధ్య లీజు విషయంలో వివాదం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. స్థలం యజమానే దాడి చేయించారని హోటల్ యజమాని ఆరోపిస్తున్నారు. ధ్వంసమైన హోటల్ ముందు సిబ్బంది ధర్నా చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -