- Advertisement -
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను అంతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజన్స్ చేసిన ఓ హెచ్చరిక మరింత భయాందోళనకు గురి చేస్తోంది.
పహల్‌గామ్ ఘటనను మరవక ముందే కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో 50 పర్యాటక ప్రదేశాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది. దీంతో పబ్లిక్ మార్కులు, గార్డెన్లు ఇతర పర్యటక ప్రదేశాలు మూతబడ్డాయి. అయితే ఇవి మళ్లీ ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయనే విషయంలో స్పష్టత లేదు. ఇంటెలిజన్స్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
- Advertisement -