Wednesday, January 22, 2025

ధరణితో 50ఏళ్ల నాటి భూ వివాదాలకు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : గ్రామాల్లో భూ వివాదాలను రూపుమాపడంతో పాటు పారదర్శకంగా భూలావాదేవిలు ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్ సైట్ వల్ల కొన్ని దశబ్దాల పాటు పరిష్కారం కాని అనేక భూ వివాదాలు పరిష్కారం అవుతున్నాయి. తెలంగాణ రాక ముందు గ్రామాల్లో నిత్యం ఎదో ఒక్క చోట భూమి వివాదాలపై ఘర్షణలు, హత్యలు చోటు చేసుకునేవి. అంతేగాక భూమి సరిహద్దు వివాదాలపై కొన్ని దశబ్దాల పాటు కోర్టుల చూట్టూ తిరిగే వారే. వాటన్నింటికి చెక్ పెడ్తూ ధరణి ‘వెబ్ సైట్ ను అమలులోకి తేగా అది అచరణలో విజయవంతంగా పనిచేస్తూ రైతులకు వరంలా మారిందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ధరణితో కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా వున్న భూ సమస్యలు పరిష్కరానికి నోచుకుంటున్నాయి.

భూ రికార్డుల్లో పేర్లు నమోదు కాక, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఫలాలు అందనటువంటి వారికి ధరణి పోర్టల్ రాకతో వారి సమస్య పరిష్కారమై, ప్రభుత్వ ఫలాలు కూడా అందుతున్నాయి.ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామ సర్వేనెం.283, 284, 285, 286, 290, 291, 292 లు గ్రామంలోని వ్యవసాయ భూములను గత 50 సంవత్సరాలుగా గ్రామస్తులు ఎకరం/ఆర ఎకరం చొప్పున సాగు చేసుకుంటున్నారు. కాని అట్టి భూములకు రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేయకపోవడం వల్ల , ఏ విధమైన టైటిల్ లేనందున ప్రభుత్వం నుండి రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ తదితర పథకాలు వారికి అందడం లేదు. దీంతో ఆ గ్రామ రైతులంతా ఈ సమస్యను ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వద్దకు తీసుకరాగా, ఆయన దీన్ని “బల్క్ ఇష్యూ”లో చేర్చి ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా స్థానిక మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

క్షేత్ర స్దాయిలో పూర్తిగా విచారణ చేసిన అనంతరం 117 మంది రైతులకు సంబంధించిన 81.25 ఎకరాలకు అసైన్‌మెంట్ పట్టాలు మంజూరు చేసి వారందరి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో చేర్చి ధరణిలో నిక్షిప్తం చేశారు.దీని వల్ల ఆ రైతులంతా ఇకపై ప్రభుత్వం నుండి రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ వంటి అన్ని లబ్ధి ఫలాలు పొందేందుకు అవకాశం కలిగింది. అదేవిధంగా ఇదే మండలంలోని జమలాపురం గ్రామంలో 1974 సంవత్సరంలో 130సభ్యులతో హరిజన,గిరిజన ఫామింగ్ కో ఆపరేటీవ్ సొసైటి ఏర్పాటు చేసుకున్నారు. సొసైటీ సభ్యులు సమిష్టి వ్యవసాయం చేసుకునేందుకు గాను 150 ఎకరాల అసైన్‌మెంట్ పట్టాను అప్పటి మధిర తహశీల్దార్ నుంచి పొందారు. కమిటీ సభ్యులంతా భూమిని 0.20 గుంటల చొప్పున పంచుకొని వ్యవసాయం చేస్తున్నారు. అయితే రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ తదితర ఫలాలు అందుకోలేకపోతున్నారు.

రైతులంతా ఈ విషయం పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సమస్యను బల్క్ ఇష్యూగా గుర్తించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించవలసినదిగా కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పూర్తి స్ధాయి విచారణ అనంతరం తాజాగా56 ఎకరాలకు గాను 123 మంది సొసైటీ సభ్యులకు అసైన్‌మెంట్ పట్టాలను మంజూరు చేసి వారికి -పాస్‌పుస్తకాలను అందజేశారు.గత 50 సంవత్సరాల నుండి పెండింగ్ వున్న ఈ సమస్యకు ధరణి పోర్టల్‌తో పరిష్కారం లభించినట్లయింది. రైతులు ధరణి ద్వారానే తమకు పట్టాలు వచ్చినట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఎర్రుపాలెం మండలం ఆయ్యవారిగూడెం, జమలాపురం గ్రామ రైతుల బల్క్ ఇష్యూను పరిష్కరించి రైతులకు భూమిహక్కు పత్రాలను తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి రైతులందరికి పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు.

ఇదే మండలంలో రెమిడిచర్లలో కూడా ఇదేవిధంగా సామూహిక భూవివాదాన్ని పరిష్కరించి పట్టాలను అందజేశారు.అదేవిధంగా పెనుబల్లి మండలం తాళ్ళపెంట, మంచాలపాడు, లంకపల్లి, సత్తుపల్లి మండలం బేతుపల్లి, కారెపల్లి మండలం మాధారం, కల్లూరు మండలం లోకారం గ్రామాల్లో బల్క్ సమస్యలు పరిష్కరించి 582 మంది లబ్ధిదారులకు 1158.32 ఎకరాలకు పాస్ పుస్తకాలను మంజూరు చేశారు.ధరణి పోర్టల్‌తో భూ సమస్యకు మార్గం సుగుమమయి, అన్ని ప్రయోజనాలకు అర్హులు కావడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరణి పోర్టల్ ద్వారానే తమకు న్యాయం జరిగిందని, ధరణితోనే సాగులో వున్న భూములకు హక్కులు పొందగలిగామని వారంతా సంతోషం వ్యక్తం చేశారు
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఖమ్మం టాప్
ధరణి పోర్టల్ లో ఖమ్మం జిల్లాలో భూ సంబంధిత విషయాల ప్రక్రియలో వేగవంతం, రైతుల భూ సమస్యలకు పరిష్కారం కలుగుతుందని అనడానికి ధరణి వచ్చిన తరువాత జిల్లాలో రైతులకు అందిన పట్టాదార్ పాస్ పుస్తకాలే చెబుతున్నాయి. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 28421 భూ క్రయవిక్రయాలు జరుగగా వారందరికి పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించారు.అంతేగాక 13808 గిప్ట్ డిడ్ లావాదేవీలు, 8151 వారసత్వం, 2272 నాలా మొత్తం 52,652 రిజిస్ట్రేషన్లు ధరణి వెబ్ సైట్ ద్వారా జరిగాయి.అంతేగాక ధరణి సమస్యలపై ప్రజలనుంచి 54563 అర్జీలు రాగా ఇప్పటి వరకు47198 దరఖాస్తులను పరిష్కరించారు. ఇందులో మ్యూటేషన్లకు సంబంధించి 11837, ఎల్ ఫామ్ జారీకి సంబంధించి 1090, భూసమస్యలకు సంబంధించి 6407,

సక్సేషన్ పిపిబి లేకుండా 444, వ్యక్తిగత పివోబి క్రింద 13857, ఎన్‌ఆర్ పిపిబి కింద 91, కోర్టు కేసుల పిపిసి కింద 190, కోర్టు కేసుల ఇంటిమేషన్ క్రింద 858, నాలా పిపిబి కింద 135, ఎగ్జిక్యూటీవ్ జిపిఏ క్రింద 253, పిపిబి డాటా సవరణ కింద 364 దరఖాస్తులు ఉన్నాయి.వ్యక్తిగత పి.ఓ.బి దరఖాస్తులకు సంబంధించి15816 దరఖాస్తులకు గాను 15366 దరఖాస్తులను అంగికరించారు .అదేవిధంగా ప్రజల నుంచి సుమోటో గా స్వీకరించిన పివోబిలకు సంబంధించి 82403 సర్వె నెంబర్లకు చెంది, మొత్తం 97107 దరఖాస్తులు స్వీకరించగా ఇప్పటి వరకు 89059 దరఖాస్తులు పరిష్కరించారు.21914 ఎకరాల ధరఖాస్తులను తిరస్కరించారు.ధరణి పై వచ్చిన ధరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక ఖమ్మం జిల్లాలోనే 80శాతం దరఖాస్తులు(క్లయిమ్స్)పరిష్కారం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News