Friday, November 22, 2024

మోహన్ బాబు నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం

- Advertisement -
- Advertisement -

విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్ గా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శోభన్ బాబుల హీరోగా నటించిన కన్నవారి కలలు(1974) సినిమాతో తెరగ్రేటం చేశారు. ఆ తర్వాత దాసరి నారాయణరావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి, ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘స్వర్గం-నరకం’(1975) తో హీరోగా మారారు. మోహన్ బాబు తొలినాళ్లలో విలన్ గా నటించారు. మోహన్ బాబు 1975 నుంచి 1990 వరకు సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు.

మోహన్ బాబు హీరోగా నటించిన సిమాల్లో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు ఆల్ టైమ్ రికార్డు హిట్స్ గా నిలిచాయి.1982లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ని స్థాపించి ‘ప్రతిజ్ఞ’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత అదే సంస్థలో 75 చిత్రాలను నిర్మించారు. శ్రీవిద్యా నికేతన్ ద్వారా విద్యారంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి 2007 లో పద్మశ్రీ అందుకున్నారు. 2016 లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News