Saturday, November 16, 2024

వ్యక్తిని కాపాడబోయి మరో వ్యక్తి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

రాజంపేట్: కుటుంబంలో కలహాల కారణంగా అత్మహత్య చేసుకుంటానని చెరువులోకి దూకిన వ్యక్తిని కాపాడడానికి వెళ్ళిన మరో వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి కుటుంబ కలహాలతో భార్యభర్తలు గోడవపడ్డారు. దీంతో భర్త కోపంతో చెరువులో పడి చనిపోతానని చెప్పి స్థానిక చెరువులోకి వెళ్ళాడు. అయితే అతని భార్య రోదిస్తూ నా భర్తను కాపాడండి అంటు రాత్రి సమయంలో అక్కడ గ్రామంలో ఉన్న వారిని కోరింది. వెంటనే కోంత మంది చెరువులోకి వెళ్ళి వ్యక్తి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కాపాడడానికి వెళ్ళిన ఎల్లారెడ్డిపల్లి తాండకు చెందిన సంగ్యా నాయక్ (50) అక్కడే అదృశ్యం అయ్యారు. గోడవడిన భార్య భర్తలు ఇంటికి వెళ్ళారు.

చెరువులోకి వెళ్ళిన సంగ్యానాయక్ ఎక్కడ అని వెతకగా చెరువు గట్టుదగ్గర బట్టలు, చెప్పులు, సెల్‌ఫోన్ ఉన్నాయి. దీంతో ఎల్లారెడ్డిపల్లి తాండకు చెందిన సంగ్యానాయక్ కుటుంబీకులు ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అట్టి వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. దీంతో రెండు గ్రామాల మద్య ఘర్షణ వాతవారణం చోటు చేసుకుంది. కోందరికి గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రెండు గ్రామాల పెద్దలతో చర్చించి అదృశ్యం అయిన వ్యక్తి గురించి గాలింపు చర్యలు చేపడుతామని సమన్వయం పాటించాలని కోరారు. అదివారం ఉదయం గజ ఈతగాళ్ళతో మృతదేహాం కోసం ఉదయం 11 గంటల నుండి రాత్రి వరకు తహసిల్దార్ శాంత, ఎస్సై రాజు తమ సిబ్బందితో కలసి అదృశ్యం అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయిన ఆచూకి లబించ లేదు.

Also Read: ఏ సర్వే చూసినా బిజెపికే మొగ్గు: బండి సంజయ్

దీంతో ఎల్లారెడ్డిపల్లి తాండ గ్రామస్తులు తమ తండా పెద్ద మనిషిని కావాలనే చంపి చెరువులో వేశారని డిమాండ్ చేశారు. పోలీసులతో గోడవ పడ్డారు. దీంతో పరిస్థితిని చూసి అదనపు బలగాలను పోలీసులు గ్రామానికి రప్పించి ఎటువంటి వివదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఒక వైపు వర్షం మరో వైపు గాలింపు చేపట్టడం కొంత అంతరాయం కలిగింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News