Wednesday, January 22, 2025

హమాస్ దాడి ఫ్లాష్‌ బ్యాక్..

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : ఇప్పుడు ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు 1973 అక్టోబర్ 6 నాటి యోమ్ కిప్పుర్ వార్‌ను గుర్తు చేశాయి. ఇప్పటిలాగానే అప్పుడు అక్టోబర్ ఆరవ తేదీన అరబ్ దేశాల సంకీర్ణ పక్షం ఇజ్రాయెల్ స్వాధీన ప్రాంతాలపైకి మెరుపుదాడులకు దిగి , దుసాహాసానికి పాల్పడింది. యూధుల అత్యంత పవిత్ర దినం యోమ్ కిప్పుర్ నాడు అక్టోబర్ 6 నాటి ఈ ఘటన ఆ తరువాత క్రమేపీ కిప్పుర్ యద్ధానికి దారితీసి, ప్రపంచ స్థాయిలో వణుకుపుట్టించింది. ఇజ్రాయెల్‌కు అరబ్ దేశాలకు బద్ధ శత్రుత్వం తీవ్రస్థాయిలో ఉన్న 1973 ప్రాంతంలో జరిగిన ఈ యుద్ధం ప్రధానంగా గోలన్ హైట్స్‌ను కేంద్రీకృతం చేసుకుని సాగింది. ఇజ్రాయెల్ ఆధీనంలోని ఈ ప్రాంతం, సినాయ్ ఇతర ప్రాంతాలను ఎంచుకుని అరబ్ కొయలిషన్ సేనలు పోరుకు దిగాయి. ఇది కూడా ఆకస్మిక మెరుపుదాడినే. ఈ దశలో ఇజ్రాయెల్ , ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మధ్య ఘర్షణ నెలకొంది.

1967లో జరిగిన ఆరురోజుల ఘర్షణ తరువాత తొలిసారిగా ఈ పరస్పర దాడుల వాతావరణ ఏర్పడింది. 1973 నాటి ఈ యోమ్ కిప్పుర్ వార్ ప్రభావం అంతర్జాతీయ తీవ్రస్థాయి పరిణామాలకు దారితీసింది. అప్పట్లో అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్ ఈ యుద్ధం సాధారణమైనది కాదని ప్రపంచ స్థాయిలో అణుయుద్ధ హెచ్చరికలు వెలువరించారు. అణుయుద్ధ ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో పశ్చిమదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించాయి. యుద్ధం తీవ్రతరం అవుతున్న దశలో ఇందుకు నిరసనగా చమురు సరఫరా సంస్థ ఒపెక్‌లో ఆధిపత్యం ఉన్న అరబ్ దేశాలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇతర పశ్చిమ దేశాలకు ముడిచమురు సరఫరా నిలిపివేశాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. రెండు వారాల పాటు సాగిన కిప్పుర్ వార్‌లో దాదాపు 20000 మంది బలి అయ్యారు. చివరికి ఇజ్రాయెల్ విజయం సాధించింది. ఇంతకు ముందు కన్నాఎక్కువగా పాలస్తీనియాకు చెందిన భూభాగాలను తన కైవసం చేసుకుంది.

ఇప్పుడు సరిగ్గా 50 సంవత్సరాల తరువాత ఇప్పుడు తిరిగి ఇజ్రాయెల్‌పై రాకెట్లతో భారీ స్థాయి అప్రకటిత యుద్ధం ఆరంభం అయింది. ఇది కూడా దాదాపుగా అప్పటిలాగానే జుడాయిజంలోని పవిత్రరోజును ఎంచుకుని చేపట్టిన ఆకస్మిక మెరుపుదాడి కావడం కీలకం. ఇప్పుడు ఈ దాడి బాధ్యతను హమాస్ తీసుకుంది. తమది ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్‌గా పేర్కొంది. ఇది కేవలం తమ సొంతపోరు కాదని , ఇజ్రాయెల్ ఆధిపత్య దుందుడుకు వైఖరిని ప్రతిఘటించేందుకు, వెస్ట్‌బ్యాంక్‌లోని ప్రతిఘటనా యోధులు చేపట్టిన పవిత్ర యుద్ధం అని ప్రకటించారు. ఈ పోరులో తమకు అరబ్ ఇతర ఇస్లామిక్ దేశాలు సహకరించాలని పిలుపు నిచ్చాయి. అక్రమంగా పాలస్తీనియా భూభాగాలను కబ్జా చేసుకున్న ఇజ్రాయెల్ విస్తరణ కాంక్షకు చెల్లుచీటి రాయాల్సిందేనని కోరారు. తమది మెరుపుదాడి కావచ్చు కానీ ఇజ్రాయెల్‌పై తమది ఆకస్మిక పోరు కాదని, ఇది నిరంతరం సాగుతున్న ప్రక్రియ అని హమాస్ తెలిపారు. అయితే ఇప్పుడు చారిత్రక అల్ అక్సా మసీదు కాంపౌండ్ వివాదం ప్రాతిపదికగా హమాస్ ఈ దాడులకు దిగింది.

అరబ్ , ముస్లిం దేశాలను తమకు తోడుగా కలిసివచ్చేలా చేసేందుకు ఇప్పుడు ఈ మసీదు సెంటిమెంట్‌కు దిగింది. ముస్లింలు, యూధుల అత్యంత పవిత్రమైన ఈ మసీదును ఇజ్రాయెల్ సేనలు అపవిత్రం చేశాయని పేర్కొంది. తిరిగి మనం ఇజ్రాయెల్‌పై యుద్ధం చేయాల్సిందేనని హమాస్ పిలుపు నిచ్చింది. ఈ మసీదు వివాదం 2021లోనూ ఇజ్రాయెల్ హమాస్‌ల మధ్య 11 రోజుల భీకర పోరుకు దారితీసింది. రెండు పొట్టేళ్ల పోరులో వేలాది మంది అమాయక పౌరులు మృతి చెందారు. ఇప్పుడు తిరిగి నెలకొన్న ఈ ఘర్షణ మరోసారి సామాన్య పౌరులకు అప్పటి నెత్తుటి జ్ఞాపకాలనే తిరిగితిరిగి సల్పేలా చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News